![]() |
![]() |
.webp)
జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కామెడీ ఎంత ఉందో తెలీదు కానీ అద్భుతమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఐతే టపటపా పేలిపోతున్నాయి. కొత్తగా వస్తున్న ఒక లేడీ టీమ్ ఇప్పుడు అలాంటి డైలాగ్స్ ని ఈ షోలో చెప్పి కెవ్వు కేక పుట్టించారు. "ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చలాన్ పంపించారు ఓవర్ స్పీడ్ కి" అని భార్య డైలాగ్ వేసేసరికి .."అసలు నేను బైకే నడపలేదు కదవే" అంటూ భర్త చెప్తాడు. దానికి భార్య సిగ్గుమొగ్గలైపోతూ "అబ్బబ్బా వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కి కాదండి మీ స్పీడ్ కి" అంటూ కాలర్ పట్టుకుని మీదకు లాక్కునేసరికి భర్త సిగ్గుపడిపోయాడు. ఇక తర్వాత శ్రీదేవి అండ్ టీం వచ్చింది "ఏవండీ సూర్యుడు ఇప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తున్నాడా అండి" అని అడిగేసరికి "అవునే నీకెందుకు ఆ డౌట్ వచ్చింది" అని భర్త అన్నాడు. "అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండీ" అని భార్య సిగ్గుపడిపోతూ కులుకుతూ చెప్పింది.
తర్వాత వర్ష అండ్ టీమ్ వచ్చింది. "ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయాక నన్ను అదోలా చూస్తున్నాడు" అని తన భర్తతో చెప్పేసరికి వెంటనే అతను అజర్ ని బయటకు పిలిచి "ముల్లొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ముల్లుకే నష్టం " అనేసరికి వర్ష సిగ్గుపడిపోతూ ముఖం మీదకు చున్నీ కప్పేసుకుంది. ఇమ్యాన్యుయెల్ పెద్ద భూస్వామి, ఆయనకు ఒక కొడుకు అజార్. ఆయనకు 20 ఎకరాలపైన ఉంది. మా నాన్నకు నాకు పెళ్లైంది, కొడుకు ఉన్నాడని అబద్ధం చెప్పాను అని వర్షకు భర్తగా నటిస్తున్న రియాజ్‌కు చెప్తాడు. దీంతో ఇరవై ఎకరాలు ఇస్తానంటే, అజార్‌కు భార్యగా నటించమని వర్షను ఒప్పిస్తాడు.

దీంతో రియాజ్ వర్ష, అజార్‌కు కొడుకుగా, వారిద్దరు భార్యభర్తలుగా నటిస్తారు. ఈ క్రమంలో అజార్‌కు తండ్రి ఇమ్మాన్యుయెల్ శోభనం ఏర్పాటు చేయడంతో రియాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. రియాజ్ ఇమ్మాన్యుయెల్‌ని శోభనం ఎవరికీ అని అడగ్గా మీ అమ్మనాన్నకు అని చెప్పడంతో అక్కడున్నవారందరూ తెగ నవ్వుతారు. అసలే సోషల్ మీడియా అంతా గందరగోళంగా ఉంది. కొన్ని రోస్ట్ ఛానెల్స్ వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైములో ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఉన్న ఇలాంటి షోస్ కూడా పిల్లల మీద ఎంతో ఎఫెక్ట్ చూపిస్తాయి. నెటిజన్స్ కూడా ఇదే విషయాన్ని కామెంట్స్ రూపంలో చెప్తున్నారు. కామెడీ తగ్గిపోతుంది చూడండి..డబుల్ మీనింగ్ జోక్స్ తో ఫేమస్ అవుతున్నారు అందరు" అంటూ పోస్ట్ చేస్తున్నారు. ఈ షో ఎక్కువ కాలం ఉండాలి అంటే మేకర్స్ కొంత డీసెన్సీ పాటించాల్సిందే అని నెటిజన్స్, ఆడియన్స్ ఇన్‌డైరెక్ట్ గా చెప్తున్నారు.
![]() |
![]() |